Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..

నందిపేట​ మండల కేంద్రంలో దుర్గాదేవి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని రూ. 2.11 కోట్లతో అలకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్: Nandipet Durga Devi Festival | మండల కేంద్రంలో (Nandipet Mandal) కొలువైన శ్రీ ఓంకార రూపిణి దుర్గాదేవి ఉత్సవ కమిటీ, శక్తిరూపిణి దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

Nandipet Durga Devi Festival | శ్రీ శక్తి రూపిణి అమ్మవారికి..

Nandipet Durga Devi Festival

ఈ సందర్భంగా శ్రీ శక్తి రూపిణి అమ్మవారిని శుక్రవారం రూ. 2.11కోట్ల నగదుతో మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. అలాగే ఓంకార రూపిణి అమ్మవారిని రూ.1.25 కోట్ల నగదుతో అలంకరించారు. కరెన్సీ నోట్ల మధ్య కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న మండపం, పూల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో ఈసారి మహా లక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Crop Diversification | సాగు రూటు మార్చాల్సిందే.. ఆరుతడి వైపు మొగ్గుచూపాల్సిన సమయమిదే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *