Kavitha Telangana Water Crisis | రైతులు త్యాగాలు చేయాలంటున్న సీఎం.. తాను రాజకీయాలను త్యాగం చేస్తారా?: కవిత సంచలన ప్రశ్న

తెలంగాణలో తాగు, సాగునీటి సమస్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు .

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Telangana Water Crisis | తెలంగాణలో తాగు, సాగునీటి సమస్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు . శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పలు కీలక విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కృష్ణానది ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, మూడేళ్లుగా ప్రతి పండగకూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పది నెలలు తీవ్ర నీటి ఎద్దడి ఉండబోతుందని హెచ్చరించిన .. ఎల్ నినో విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ఢిల్లీకి వెళ్లి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

Kavitha Telangana Water Crisis | విమర్శలు ఆపాలి..

ఈ ఏడాది ప్రారంభంలోనే ఎల్ నినో వస్తుందని నిపుణులు హెచ్చరించినా, ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎంను ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు గత ఆగస్టులోనే కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదికలు పంపిస్తే.. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చి రైతులు త్యాగాలు చేయాలని అనడం సరికాదన్నారు. రైతులను పంటలు వేయొద్దని చెబుతున్న ముఖ్యమంత్రి.. తాను రాజకీయాలను త్యాగం చేస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా.. ఇంకెన్నాళ్లు పాత ప్రభుత్వాన్ని తిడుతూ కాలం సాగదీస్తారని మండిపడ్డారు.

Kavitha Telangana Water Crisis | కవిత డిమాండ్..

కరువు పరిస్థితుల నేపథ్యంలో కమిటీలు వేసి కాలయాపన చేయకుండా, కేంద్రం నుంచి అనుమతులు వచ్చే వరకు రైతులను ఎండబెట్టవద్దని కవిత హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుకూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్న పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు కాలంలో ఆదుకునేందుకు రాష్ట్రంలోని రైతుకూలీలందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు.

Kavitha Telangana Water Crisis| యాదాద్రి పవర్ ప్లాంట్..

మరోవైపు విద్యుత్ కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను ప్రైవేటీకరించడం వెనుక ఉన్న మర్మం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఉన్న విద్యుత్ కేంద్రాలను ప్రైవేటుపరం చేయడం వల్ల ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *