అక్షరటుడే వెబ్‌డెస్క్: Liverpool University Bengaluru Campus | ప్రపంచ ప్రసిద్ధి చెందిన లివర్‌పూల్ విశ్వవిద్యాలయం బెంగళూరులో తన నూతన క్యాంపస్‌ను గురువారం అధికారికంగా ప్రారంభించింది. కర్ణాటకలో ( Karnataka ) క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన తొలి ‘రస్సెల్ గ్రూప్’ విశ్వవిద్యాలయంగా ఇది రికార్డు సృష్టించింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో ఈ క్యాంపస్‌ను నెలకొల్పారు. తొలి విద్యా సంవత్సరంలో భాగంగా దాదాపు 300 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.
భారత్-యూకే ఉన్నత విద్యా రంగానికి మైలురాయిగా నిలిచిన ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రి ఎం.బి. పాటిల్, లివర్‌పూర్ సిటీ రీజియన్ మేయర్ స్టీవ్ రోథెరమ్, బ్రిటీష్ కౌన్సిల్ ఇండియా డైరెక్టర్ అలిసన్ బారెట్ , లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ దిగ్గజం రాబీ ఫౌలర్ తదితరులు పాల్గొన్నారు.
Liverpool University Bengaluru Campus | కీలక కోర్సులు..
ఈ క్యాంపస్‌లో మొదటి దశ కింద కంప్యూటర్ సైన్స్, గేమ్ డిజైన్, బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, బయోమెడికల్ సైన్సెస్ వంటి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే కోర్సులను అందిస్తున్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అభ్యసన వాతావరణాన్ని అందించేలా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.
Liverpool University Bengaluru Campus | భారత సంతతి శాస్త్రవేత్త..
లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేసి, నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ హర్ గోవింద్ ఖురానా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన గౌరవార్థం క్యాంపస్‌లోని ఒక లెక్చర్ థియేటర్‌కు ఆయన పేరు పెట్టడమే కాకుండా, ఆయన పీహెచ్డీ పరిశోధన పత్రాల ఒరిజినల్ ప్రతిని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
Liverpool University Bengaluru Campus | పరిశోధనా రంగాలు..
బెంగళూరులోని ప్రముఖ సంస్థలైన నిమ్హాన్స్ (NIMHANS), ఐఐఎస్సీ (IISc), ఎన్సీబీఎస్ (NCBS) , ఇతర ప్రైవేట్ దిగ్గజ సంస్థలతో కలిసి పరిశోధనలు, ఆవిష్కరణలను విస్తరించేందుకు లివర్‌పూల్ యూనివర్సిటీ ప్రతినిధులు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ క్యాంపస్ రాకపై కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టిమ్ జోన్స్ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కేంద్రం విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్‌క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం