అక్షరటుడే వెబ్డెస్క్: Biocon Biosimilar Launch | ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ ‘బయోకాన్ లిమిటెడ్’ స్టాక్ ఎక్స్చేంజ్లకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఫార్మా దిగ్గజం జెనెన్టెక్తో (Genentech) దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించుకున్నట్లు, అలాగే పెబ్రిల్జో (Pebprizlo) బయోసిమిలర్ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయడానికి నిర్దిష్టమైన లాంచ్ తేదీల (ఎర్లియెస్ట్ లైసెన్స్డ్ లాంచ్ డేట్స్) లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
Biocon Biosimilar Launch | ప్రారంభ తేదీలు..
పెబ్రిల్జో బయోసిమిలర్ను సాధ్యమైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు గాను కంపెనీ స్పష్టమైన కాలవ్యవధిని ఖరారు చేసింది. దీని ప్రకారం 2027 తొలి త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్ , యూకేలో, 2028 మూడో త్రైమాసికంలో అమెరికాలో ( US ), అలాగే 2026 నుంచి 2028 మధ్య కాలంలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ (ఆర్వోడబ్ల్యూ) మార్కెట్లలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.
Biocon Biosimilar Launch | క్యాన్సర్ చికిత్సలో ప్రాధాన్యత..
పెబ్రిల్జో అనేది ‘పెర్జెటా’ (పెర్టుజుమాబ్) ఔషధానికి బయోసిమిలర్ రూపాంతరం. దీనిని బ్రెస్ట్ క్యాన్సర్ (HER2-పాజిటివ్) వ్యాధికి సంబంధించి వివిధ దశల్లోని చికిత్సల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. జెనెన్టెక్తో కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందం వల్ల అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో బయోకాన్ స్థానం మరింత బలోపేతం కానుంది.
ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం