Abhijit Deepke Arrest | సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే అరెస్ట్​

కాక్రోచ్​ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abhijit Deepke Arrest | కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్​ చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ చేపట్టడానికి ఆయన వెళ్లేందుకు యత్నించగా.. అదుపులోకి తీసుకున్నారు.

జంతర్ మంతర్‌ను నిరసన స్థలం జాబితా నుంచి తొలగించడంతో సీజేపీ నాయకులు సౌరవ్​దాస్​, అశుతోష్​ రాంకాలను ఇటీవల పోలీసులు అరెస్ట్​ చేశారు. వారికి కోర్టు ఐదు రోజులు రిమాండ్​ విధించింది. దీనికి నిరసనగా సీజేపీ అధ్యక్షుడు దీప్కే శుక్రవారం సాయంత్రం లెహ్రో దో తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు మొదట ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.

Abhijit Deepke Arrest | నేహా బోరాను సైతం

విద్యార్థి నాయకురాలు నేహా బోరాను జంతర్ మంతర్ సమీపంలో నిర్బంధించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐసా అధినేత్రి నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరం మధ్యలో ఉన్న షాపింగ్ కేంద్రమైన కన్నాట్ ప్లేస్ ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ‘తిరంగా యాత్ర’కు అనుమతి ఇవ్వలేదని, ఒకవేళ CJP ఈ యాత్రను కొనసాగిస్తే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పోలీసులు హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Worms in KitKat Chocolate | కిట్​క్యాట్​ చాక్లెట్​లో పురుగులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *