నిజామాబాద్Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు: అడిషనల్​ కలెక్టర్​

Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు: అడిషనల్​ కలెక్టర్​

పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్​ అడిషనల్​ కలెక్టర్​ కిరణ్​కుమార్​ హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో దత్తత సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అక్షరటుడే, ఇందూరు: Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అడిషనల్​ కలెక్టర్​ కిరణ్​కుమార్​ (Additional Collector Kiran Kumar) పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. ‘బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ’లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో దత్తత సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Child Adoption Rules | మిషన్​ వాత్సల్య పోర్టల్​ ద్వారా..

ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పోర్టల్ (Mission Vatsalya Portal) ద్వారా పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాకాకుండా అక్రమంగా దత్తత తీసుకున్న వారిపైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియను కావాల్సిన పత్రాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను అందజేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్​కు (Hyderabad) చెందిన దంపతులకు బాబును దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, కార్యాలయం సిబ్బంది అనిత, అనిల్, ముజాహిద్, స్రవంతి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bala Bharosa Program | బాలభరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

TG Organics App | ప్రభుత్వం గుడ్​న్యూస్.. యాప్​లో సేంద్రియ ఉత్పత్తులు కొనొచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Organics App | ప్రస్తుతం సేంద్రియ...

Free Foundation Course | ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Free Foundation Course | తెలంగాణ ఎస్సీ...

Kisan Helpline | కిసాన్ హెల్ప్‌లైన్‌కు సీఎం ఫోన్.. సిబ్బంది సమాధానంపై ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kisan Helpline | ప్రభుత్వాలు వివిధ పనుల...

Hyderabad ORR | ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad ORR | మహానగరం చుట్టూ ఉన్న ఔటర్...