Gold Smuggling | బంగ్లాదేశ్​ నుంచి హైదరాబాద్​కు గోల్డ్​ స్మగ్లింగ్​.. ఐదుగురి అరెస్ట్

బంగ్లాదేశ్​ నుంచి హైదరాబాద్​ నగరానికి అక్రమంగా తరలిస్తున్న బంగారం, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Smuggling | బంగ్లాదేశ్​ నుంచి హైదరాబాద్​ నగరానికి అక్రమంగా తరలిస్తున్న బంగారం, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను విజయవాడ సమీపంలో అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ నుంచి విదేశీ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి, కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌ (Hyderabad)కు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్​ డీఆర్​ఐ అధికారులు విజయవాడ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఒక కారును ఆపి అందులో సోదాలు చేశారు. ఆ కారులో 3.14 కిలోల బంగారం, 60,000 డాలర్లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 5.84 కోట్లు ఉంటుందని తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 18న నిందితులను అదుపులోకి తీసుకోగా.. తాజాగా వివరాలు వెల్లడించారు.

Gold Smuggling | నడుము చుట్టూ బంగారం..

మొదట కారులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ వెళ్తున్న ఒక బస్సును ఆపి సోదాలు చేశారు. నడుము చుట్టూ ఉన్న సంచులలో దాచి ఉంచిన సుమారు 3.1 కిలోగ్రాముల బరువున్న మూడు బంగారు కడ్డీలను తీసుకువెళ్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు పంపారు.

ఇది కూడా చదవండి..: Traffic Restrictions | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *