CJP Leaders Released | జైలు నుంచి విడుదలైన సీజేపీ నాయకులు

సీజేపీ నాయకులు సౌరవ్​ దాస్​, అశుతోష్​ రాంకా జైలు నుంచి విడుదల అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Leaders Released | సీజేపీ నాయకులు సౌరవ్​ దాస్​, అశుతోష్​ రాంకా జైలు నుంచి విడుదల అయ్యారు. జ్యుడిషియల్​ కస్టడీలో ఉన్న వారిని విడిచి పెట్టాలని మేజిస్ట్రేస్​ ఆదేశించడంతో పోలీసులు రిలీజ్​ చేశారు.

జంతర్​ మంతర్​ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు వీరిని పోలిసులు ఈ నెల 13న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరు పర్చగా.. 5 రోజుల రిమాండ్​ విధించింది. సోమవారం కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. ఈ క్రమంలో బుధవారం వారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్​ వేయాలని ధర్మాసనం చెప్పడంతో మళ్లీ.. కింది కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి వారిని విడుదల చేయాలని ఆదేశించారు. మరో మూడు రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ పోలీసులు కోరారు. సాయంత్రం 6 గంటల తర్వాత, వారి పూచీకత్తులు, శాంతి బాండ్లను అంగీకరించినట్లు పేర్కొంటూ వారిని విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.

CJP Leaders Released | హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సౌరవ్​ దాస్​, అశుతోష్​ రాంకా విడుదల కాకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని సీజేపీ హైకోర్టులో పిటిషన్​ వేసింది. ఈ పిటిషన్​ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్ ఉల్లంఘన’ను ప్రముఖంగా ప్రస్తావించింది. నిరసనలు హింసాత్మకంగా మారిన ఫ్రాన్స్ వంటి దేశాలను కూడా ఇది ఉదహరించింది. ‘బారికేడ్లను బద్దలు కొట్టినప్పుడు, మరింత మంది మిమ్మల్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. మీ అదుపులో లేని వ్యక్తులు కూడా ఉండవచ్చు’ అని కోర్టు పేర్కొంటూ, “మన దేశం వెలుపల ఇలా జరగడం మనం చూశాం. విద్యార్థుల నిరసనలుగా ప్రారంభమైనవి, అగ్నిప్రమాదాలు మరియు భవనాలను తగలబెట్టే స్థాయికి దిగజారాయి,” అని జోడించింది.

దీనిని కూడా చదవండి : Hyderabad Traffic Jam | పట్నం బాట పట్టిన ప్రజలు.. భారీగా ట్రాఫిక్​ జామ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *