Hyderabad Traffic Jam | పట్నం బాట పట్టిన ప్రజలు.. భారీగా ట్రాఫిక్​ జామ్

దసరాకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్​కు తిరుగు పయనం అయ్యారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Traffic Jam | దసరా (Dasara)కు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు.. పండుగ ముగియడంతో పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్​కు వచ్చే అన్ని రహదారులు రద్దీగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నాడు. వేడుకల కోసం హైదరాబాద్​ నగరంలో వలస ఉంటున్న లక్షలాది మంది స్వగ్రామాలకు వెళ్లారు. పండుగ ముగియడంతో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్​కు తిరుగు పయనం అయ్యారు. దీంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై, చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా (Pantangi toll plaza) వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అక్టోబర్ 22న పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు అధికమయ్యాయి.

Hyderabad Traffic Jam | బస్సుల్లో రద్దీ

తెలంగాణలోని ఆయా జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ప్రజలు వస్తున్నారు. దీంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. వీటిలో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గురువారం సైతం బస్సుల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : TG Safe Food Raids | టీజీ సేఫ్​ అధికారుల దాడులు.. 55 టన్నుల ఆహార పదార్థాల సీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *