Axis Bank Visa Festive Offers | షాహిద్ కపూర్, అమిత్ త్రివేదీల మేజిక్‌తో యాక్సిస్ బ్యాంక్, వీసా పండుగ క్యాంపెయిన్ రీ-లాంచ్!

భారత ప్రైవేట్ రంగ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా (Visa) భాగస్వామ్యంతో 'దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ 2026' కింద ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Axis Bank Visa Festive Offers | భారత ప్రైవేట్ రంగ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా (Visa) భాగస్వామ్యంతో ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ 2026’ కింద ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ‘ఈ పండుగ సీజన్‌లో ప్రతీ సంతోషాన్ని పెద్దదిగా చేయండి’ (Iss festive season, har khushi ko banao badi) అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రకటనను రూపొందించారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ( Shahid Kapoor ) ,  సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీల కాంబినేషన్‌లో సరికొత్త మేజికల్ వరల్డ్‌ను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ ప్రకటన ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటోంది.

Axis Bank Visa Festive Offers | మాయా బొమ్మల ఇల్లు..

ఈ క్యాంపెయిన్ ఒక చిన్నారి , ఆమె వద్ద ఉన్న మాయా బొమ్మల ఇల్లు (డాల్‌హౌస్) చుట్టూ తిరుగుతుంది. ఆ చిన్నారి బొమ్మల ఇంట్లో ఏ వస్తువును ఉంచితే అది నిజ జీవితంలో సాకారమవుతుంది. ఈ ప్రక్రియలో యాక్సిస్ బ్యాంక్ వీసా క్రెడిట్ కార్డుతో షాహిద్ కపూర్ ఆ ఆశయాలను, కలలను నిజం చేయడానికి తోడ్పడతారు. చిన్న చిన్న ఆశలను పండుగ వేళ పెద్ద మైలురాళ్లుగా మార్చవచ్చనే ఆలోచనకు ఈ కాన్సెప్ట్ ఒక ప్రతిరూపంగా నిలుస్తుంది.

Axis Bank Visa Festive Offers | బ్రాండ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు..

క్యాంపెయిన్‌తో పాటు కస్టమర్ల పండుగ షాపింగ్‌ను మరింత వేడుకగా మార్చేందుకు యాక్సిస్ బ్యాంక్, వీసాలు కలిసి 100 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్జీ (LG), శామ్సంగ్, సోనీ వంటి దిగ్గజ బ్రాండ్లతో పాటు షాపింగ్ & లైఫ్‌స్టైల్‌లో బర్‌బెర్రీ, బాస్, కోచ్, టోరీ బర్చ్, ట్రావెల్ కేటగిరీలో మేక్‌మైట్రిప్, ఐక్సిగో, ఎయిర్ ఇండియా , మొబైల్స్ విభాగంలో వివో (vivo), ఒప్పో (OPPO) వంటి ప్రముఖ సంస్థలపై ఈ ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ వీసా క్రెడిట్ కార్డుదారులు ఈ పండుగ కొనుగోళ్లు , ఈఎంఐ (EMI) లావాదేవీలపై గరిష్టంగా 20% వరకు తక్షణ డిస్కౌంట్లతో పాటు పలు రకాల ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

Axis Bank Visa Festive Offers | అద్భుతమైన సంగీతం..

ఈ యాడ్ ఫిలింకు ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించిన ఒరిజినల్ పండుగ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ వాతావరణానికి తగిన ఉత్సాహాన్ని నింపుతూ, వినియోగదారులకు భావోద్వేగంగా కనెక్ట్ అయ్యేలా ఈ సంగీతాన్ని స్వరపరిచారు.

యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ & పేమెంట్స్ హెడ్ ఆర్ణికా దీక్షిత్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూప్ మనోహర్, , వీసా మార్కెటింగ్ హెడ్ గౌరవ్ రామ్‌దేవ్ మాట్లాడుతూ.. పండుగ వేళ వినియోగదారులు కోరుకునే సౌలభ్యాన్ని, ఆర్థిక వెసులుబాటును అందించడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, అవుట్‌డోర్ ప్రచారాలు , బ్యాంక్ శాఖల ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *