ED Betting App Raids | ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై ఈడీ ఉక్కుపాదం.. తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ , గేమింగ్ యాప్స్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ED Betting App Raids | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ , గేమింగ్ యాప్స్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఉత్తరాది, పశ్చిమ భారతంలో గత వారం నిర్వహించిన మెరుపు దాడుల కొనసాగింపుగా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు, హవాలా లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగారు.

ED Betting App Raids | నార్త్ ఇండియాలో సోదాలు..

పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా గత వారం ముంబై, పూణే, సూరత్, మెహసానా నగరాల్లోని 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ‘ఐపైసా’ వంటి గేమింగ్, పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ల ముసుగులో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ED Betting App Raids | బోగస్ కంపెనీలు..

ఈ విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాన్యులను మోసకరి ఆశలతో కొల్లగొట్టిన సొమ్మును నేరుగా తరలించకుండా, దేశవ్యాప్తంగా 200లకు పైగా బోగస్ (షెల్) కంపెనీలు, కో-ఆపరేటివ్ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి మళ్లించినట్లు ఈడీ తేల్చింది. ఈ అక్రమ సంపాదనను క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చి దుబాయ్ సహా ఇతర విదేశీ ఖాతాలకు తరలించినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. సోదాల సమయంలో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, నగదు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.

ED Betting App Raids | రాంధానీ అరెస్ట్..

ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ‘ఎడ్‌సోమ్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు రాంధానీని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది. ఆయన విచారణలో వెల్లడించిన సమాచారం, సీజ్ చేసిన డిజిటల్ డేటా ఆధారంగానే తాజాగా హైదరాబాద్, విజయవాడల్లోని ( Vijayawada ) లోకల్ ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు.

ఇది కూడా చదవండి:  Ration Dealers | రేషన్​డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *