Avocado Benefits | షుగర్ కంట్రోల్ నుంచి కంటిచూపు వరకు.. అవకాడో అద్భుత ప్రయోజనాలు ఇవే..!

మన మార్కెట్లలో ఇటీవల 'అవకాడో' పండు ఎక్కువగా కనిపిస్తోంది. కూరగాయల మాదిరిగానే వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Avocado Benefits | మన మార్కెట్లలో ఇటీవల ‘అవకాడో’ పండు ఎక్కువగా కనిపిస్తోంది. కూరగాయల మాదిరిగానే వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు తూర్పు, పశ్చిమ కనుమల్లో రైతులు అవకాడో సాగు చేపట్టడంతో దిగుబడి పెరుగుతోంది. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే లభించే ఈ పండు ధర కిలో రూ.200 వరకు ఉండేది. అయితే ఇప్పుడు మన దేశంలోనే విస్తృతంగా పండుతుండటంతో ధర తగ్గి, రూ.100 కే 3-4 పండ్లు లభిస్తున్నాయి.

Avocado Benefits | అవకాడో విశేషాలు..

అవకాడోకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ ఉండటంతో మన దేశంలో కూర్గ్, మైసూర్, నీలగిరి, కేరళ ( Kerala ) కొండ ప్రాంతాల్లో టీ తోటల్లో అంతర పంటగా పెంచుతున్నారు. విత్తనంతో చెట్లు కాపునకు రావడం ఆలస్యమవుతుంది కాబట్టి, అంటుకట్టే పద్ధతిలో రెండు లేదా మూడేళ్లలోనే కాపు అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి కొవ్వులు, పీచు పదార్థాలతో నిండి ఉండే ఈ పండు లోపల ఉండే గింజ చుట్టూ వెన్నలాంటి గుజ్జు ఉంటుంది. అందుకే దీనిని తెలుగులో ‘వెన్న పండు’ అని కూడా పిలుస్తారు.

Avocado Benefits | ఎలా ఎంచుకోవాలి?

అవకాడో కాయ పక్వానికి రాకముందే తెంపితే దిగువన గుజ్జు దెబ్బతింటుంది కాబట్టి, సరిగ్గా చూసి ఎంచుకోవాలి. కాయ మరీ గట్టిగా ఉంటే కొన్ని రోజులు పేపరులో చుట్టి ఉంచితే పండుగా మారుతుంది. తొడిమ భాగం లేత పసుపు రంగులో ఉంటే కాయ బాగున్నట్లు గుర్తించాలి. నల్లటి మచ్చలు ఉన్నవి లేదా నల్లగా ఉన్నవి తీసుకోకూడదు. ఈ పండు గుజ్జును నేరుగా తినవచ్చు లేదా సలాడ్లు, స్మూతీలు, శాండ్‌విచ్‌లు, బ్రెడ్లపై రాసుకుని తినడానికి ఉపయోగిస్తారు.

Avocado Benefits | ఆరోగ్య ప్రయోజనాలు..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలోని బెంగళూరు ఐఐహెచ్‌ఆర్ (IIHR) పరిశోధనల ప్రకారం అవకాడో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే మంచి కొవ్వులు రక్తాళాల్లో చెడు కొవ్వును తగ్గించి గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తాయి. 100 గ్రాముల గుజ్జులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగై బరువు నియంత్రణలో ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో మధుమేహ బాధితులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కెరోటినాయిడ్లు పిల్లల్లో కంటిచూపును మెరుగుపరుస్తాయి.

ఇది కూడా చదవండి: Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *