అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: National Cricket Selection | జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి అన్నివిధాలా సహకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President KTR) కేటీఆర్ పేర్కొన్నారు. క్రీడాకారిణి గూడెపు వంశికను ఆయన శుక్రవారం సన్మానించారు.
National Cricket Selection | ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి..
రాజన్న సిరిసిల్ల (rajanna Sirisilla) జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గూడెపు వంశిక జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది. నవంబర్ మొదటి వారంలో జమ్మూ కశ్మీర్లో జరిగే పోటీల్లో జాతీయజట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు ఆర్థిక సాయం అందించి మంచి కోచింగ్ అకాడమీలో చేర్పించేవిధంగా సహకరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: పాత రోజులు మళ్లీ తెచ్చారు…జనరేటర్లు రెడీ చేస్తున్న రైతులు