అక్షరటుడే, కామారెడ్డి: Paramedical Courses | ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి (Kamareddy)లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా ఒక ప్రకటన విడుదల చేశారు.
Paramedical Courses | మెడికల్ కళాశాలలో..
మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లో 30 సీట్లు, డిప్లొమా ఇన్ ఎకో కార్డియోగ్రఫీలో 30 సీట్లు ఉన్నట్టు తెలిపారు. ఈనెల 24 నుండి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత జిరాక్స్ కాపీ, దరఖాస్తు ఫారం, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను మెడికల్ కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం తెలంగాణ పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్ సైట్ http://www.tgpmb.telangana.gov.in ను సందర్శించాలన్నారు.
ఇది కూడా చదవండి..: TGPSC Exam Centre Inspection | టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్