Paramedical Courses | ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సులకు 60 సీట్లు

ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డిలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Paramedical Courses | ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి (Kamareddy)లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా ఒక ప్రకటన విడుదల చేశారు.

Paramedical Courses | మెడికల్​ కళాశాలలో..

మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లో 30 సీట్లు, డిప్లొమా ఇన్ ఎకో కార్డియోగ్రఫీలో 30 సీట్లు ఉన్నట్టు తెలిపారు. ఈనెల 24 నుండి 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత జిరాక్స్ కాపీ, దరఖాస్తు ఫారం, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను మెడికల్ కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం తెలంగాణ పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్ సైట్ http://www.tgpmb.telangana.gov.in ను సందర్శించాలన్నారు.

ఇది కూడా చదవండి..: TGPSC Exam Centre Inspection | టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *