Health Ticket Bus | శారీరక శ్రమతోనే ప్రయాణం.. 20 బస్కీలు తీస్తే బస్సు టికెట్ ఉచితం!

Naresh Chandan
Health Ticket Bus

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Health Ticket Bus | సాధారణంగా బస్సు BUS లో ప్రయాణించాలంటే డబ్బులు చెల్లించి టికెట్ కొనుక్కోవడం చూస్తుంటాం. కానీ రొమేనియాలోని ‘క్లూజ్-నపోకా’ నగరంలో ఒక వినూత్న పద్ధతి అమల్లోకి వచ్చింది.

ఇక్కడ ప్రయాణికులు నగదుకు బదులుగా తమ శారీరక శ్రమతో టికెట్ పొందొచ్చు. బస్సు స్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రం ఎదుట రెండు నిమిషాల్లో 20 స్క్వాట్స్ (బస్కీలు) తీస్తే ఉచితంగా బస్సు టికెట్ లభిస్తుంది.

Health Ticket Bus | ఆరోగ్యమే మహాభాగ్యం:

ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించేందుకు, వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించేందుకు స్థానిక యంత్రాంగం ఈ “హెల్త్ టికెట్” (Health Ticket) అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. స్పోర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా ప్రారంభమైన ఈ ఆలోచన ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

బస్సు స్టాప్‌లో ఒక ప్రత్యేకమైన స్మార్ట్ బూత్‌ను ఏర్పాటు చేశారు. అందులో అమర్చిన కెమెరా ప్రయాణికుడు తీసే స్క్వాట్స్‌ను గణిస్తుంది. సరిగ్గా 20 బస్కీలు పూర్తి చేయగానే, ఆ యంత్రం నుంచి ఉచిత ప్రయాణ టికెట్ బయటకు వస్తుంది. ఈ టికెట్‌తో నగరంలో ఎక్కడికైనా ఒకసారి ప్రయాణించవచ్చు.

Health Ticket Bus | వైరల్ అవుతున్న వీడియో:

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా యంత్రం ఎదుట బస్కీలు తీస్తూ ఉచిత టికెట్లు పొందడం ఆ వీడియోలో కనిపిస్తుంది. “డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. ఇలాంటి ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ ఉండాలి” అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *