అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagpur Fake Currency | మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. ఓ అద్దె ఇంట్లో ఫేక్ కరెన్సీని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
నాగ్‌పూర్‌లోని రూ.500 నకిలీ నోట్లు, ఒక ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సామగ్రి విలువ సుమారు రూ. 37.83 లక్షలు ఉంటుందని అంచనా. నకిలీ కరెన్సీ ముద్రణ వ్యవహారానికి సంబంధించి, కృష్ణ బందనే (29) అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Nagpur Fake Currency | అద్దె కోసం వెళ్తే..
నాగపూర్‌లోని త్రిమూర్తి నగర్‌కు చెందిన పుష్పక్ కృష్ణ వాథోడాలోని ‘త్రీ స్టార్ కోఆపరేటివ్ సొసైటీ’లో రమేశ్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. జనవరితో అతని అద్దె ఒప్పందం ముగిసింది. అప్పటి నుంచి అతడు రెంట్ కట్టడం లేదు. ఇంటి యజమాని రమేష్ గదిని ఖాళీ చేయమని కోరగా, పుష్పక్ అతడిని కత్తితో బెదిరించినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేసు నమోదు అయింది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా కృష్ణ గదికి రావడం లేదు. దీంతో యజమాని రమేశ్ శనివారం తాళం పగులకొట్టి లోనికి వెళ్లి చూశాడు. అక్కడ భారీగా నకిలీ కరెన్సీ నోట్లు ఉండటంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Cyclone Arnab | తుపాన్ ఎఫెక్ట్.. 28 నుంచి భారీ వర్షాలు