North Block Fire | పార్లమెంట్‌ సమీపంలో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: North Block Fire | దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ సమీపంలో నార్త్​ బ్లాక్‌ నుంచి నల్లటి పొగ బయటకు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఢిల్లీ (Delhi)లోని రైసినా హిల్‌పై ఉన్న చారిత్రాత్మక, ఎర్ర ఇసుకరాయి పరిపాలనా భవనం అయిన నార్త్ బ్లాక్ వెనుక నుంచి ఉదయం ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ కనిపించింది. దీంతో స్థానికులు, అధికారులు ఆందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నార్త్ బ్లాక్ లోపల గుర్తు తెలియని ప్రదేశం నుండి పొగ వస్తున్నట్లు తమకు ఒక కాల్ వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు.

North Block Fire | ఆరు ఫైరింజన్లతో..

అగ్ని మాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి వేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం, దాని తీవ్రత, లేదా ఏమైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. పార్లమెంటుకు వెళ్లే మార్గంలో నార్త్ బ్లాక్ వెనుక నుండి పొగ రావడం గమనించానని ఎంపీ మిలింద్ దేవరా ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Ayodhya Ram Mandir Timings | అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు ఇవే..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *