లైఫ్​ స్టైల్​Screen Time Autism | పిల్లలకు ఫోన్​ ఇస్తున్నారా.. పొంచి ఉన్న ఆటిజం ముప్పు

Screen Time Autism | పిల్లలకు ఫోన్​ ఇస్తున్నారా.. పొంచి ఉన్న ఆటిజం ముప్పు

ఏడాదిలోపు పిల్లలు స్మార్ట్​ఫోన్​ చూడటానికి అలవాటు పడితే వారికి ఆటిజం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Screen Time Autism | ప్రస్తుతం పిల్లలు స్మార్ట్​ఫోన్​ (Smartphone)తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఫోన్​తోనే ఉంటున్నారు. అయితే ఫోన్​ ఎక్కువ సేపు చూసే పిల్లల్లో ఆటిజం ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పసిపిల్లలు ఫోన్లు చూడటం ప్రస్తుతం సాధారణం అయిపోయింది. తమ పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి తల్లిదండ్రులు ఫోన్​ అప్పగిస్తున్నారు. దీంతో వారు దానికి బానిసలుగా మారుతున్నారు. చివరకు అన్నం తినాలన్నా ఫోన్​లో వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) అధ్యయనంలో కీలక విషయం వెలుగు చూసింది. ఒక సంవత్సరం లోపు పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల, మూడేళ్ల వయసు వచ్చేసరికి ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ఆ వయసులో పిల్లలకు ముఖాలు, మాటలు, ఆటలు కావాలి, స్క్రీన్లు కాదని వైద్యులు తెలిపారు.

Screen Time Autism | అబ్బాయిలలో..

స్క్రీన్ సమయం, ఆటిజంపై పరిశోధన జరిగింది. సుమారు ఒక సంవత్సరం వయస్సులో ఎక్కువసేపు స్క్రీన్‌కు గురైన పిల్లలకు, ముఖ్యంగా అబ్బాయిలలో, మూడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాల పరంగా అమ్మాయిలలో కూడా ఇలాంటి పోకడలే కనిపిస్తాయని ఎయిమ్స్ (AIIMS) పీడియాట్రిక్ న్యూరాలజీ డివిజన్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ షెఫాలీ గులాటి అన్నారు. తాము ఆటిజం ఉన్న పిల్లలను, ఇతర పిల్లలను పోల్చి ఒక అధ్యయనం చేసినట్లు ఆమె చెప్పారు. వారి స్క్రీన్ డిపెండెన్సీ స్కోర్లు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Screen Time Autism | ముందుగా గుర్తించాలి

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (Autism Spectrum Disorder) సామాజిక పరస్పర చర్య, సంభాషణ, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. దీనిని 12-18 నెలల వయస్సులోనే గుర్తించవచ్చు. ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం కీలకం. అయితే పిల్లలకు ఫోన్లను దూరంగా ఉంచాలని వైద్యులు చెప్పారు. 18 నెలల లోపు పిల్లలు అసలు ఫోన్లు చూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 18 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య, స్క్రీన్ సమయం చాలా తక్కువగా ఉండాలన్నారు. రోజుకు సగటున గంటలోపు మాత్రమే ఉండాలని, అది కూడా పెద్దల పర్యవేక్షణ అవసరం అని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Onion Heat Relief | ఉల్లిపాయకు అంత పవర్​ ఉందా.. జేబులో పెట్టుకుంటే ఎండల నుంచి ఉపశమనం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...

 Kavitha Political Statement | కాంగ్రెస్​ను గద్దె దించుతాం.. టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Political Statement | కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని...