Tamil Nadu Prison Break | ఖైదీల పరారీ.. సీఎం విజయ్​పై స్టాలిన్​ విమర్శలు

తేని జిల్లాలో జైలు గోడలను బద్దలు కొట్టి ఖైదీలు పరారు అయిన నేపథ్యంలో సీఎం విజయ్​ ప్రభుత్వంపై మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Prison Break |తమిళనాడులోని తేని జిల్లాలో జైలు గోడలను బద్దలు కొట్టి ఖైదీలు పరారు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో సీఎం విజయ్​ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ.. “బ్రేకింగ్ బ్యాడ్” తర్వాత, ఇప్పుడు తమిళనాడులో “ప్రిజన్ బ్రేక్” మొదలైందని ఎద్దేవా చేశారు. డ్రగ్స్​ కేసులో టీవీకే నాయకుడు అరెస్ట్ కావడంతో స్టాలిన్ (Stalin) ఆ పార్టీని “బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ” అని విమర్శించారు. సోమవారం తెక్కంపట్టి సబ్-జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడంతో, మంగళవారం స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఎక్స్​ వేదికగా విమర్శలు చేశారు.

Tamil Nadu Prison Break | అసమర్థ ప్రభుత్వం

టీవీకే ప్రభుత్వంలో బెయిల్​పై విడుదలైన నిందితులపై పర్యవేక్షణ లేదని, జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా పట్టుకోలేక తప్పించుకునేలా చేస్తోందన్నారు. అసమర్థ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. విజయ్​ ప్రభుత్వాన్ని పనికిరాని ప్రభుత్వం అని అభివర్ణించారు. 1995 తర్వాత రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటి సారిఅన్నారు. భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థలు అత్యంత ఆధునికంగా ఉండాల్సిన ఈ కాలంలో ఇలాంటి ఘటన జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. విజయ్​ పాలనలో బయట ఉన్న నేరస్థులు స్వేచ్ఛగా నేరాలు చేస్తుంటే, జైలులో ఉన్నవారు తప్పించుకుంటున్నారని చురకలు అంటించారు.

Tamil Nadu Prison Break | తీవ్ర విమర్శలు

జైలు నుంచి ఖైదీలు పారిపోవడంతో విజయ్​ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులను కొట్టి ఖైదీలు పారిపోతే.. బయట ప్రజల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా పారిపోయిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Microsoft Voluntary Exit Offer | మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్ .. భారత్‌లోనూ ఉద్యోగాలకు గండం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *