Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్‌ మర్డర్ కేసులో ట్విస్ట్.. హైకోర్టుకు దోషుల అప్పీల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్ మర్డర్' కేసులో విచారణ కీలక దశకు చేరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meerut Blue Drum Murder | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసులో విచారణ కీలక దశకు చేరింది. భర్తను హతమార్చి డ్రమ్‌లో పాతిపెట్టిన కేసులో మరణశిక్ష పడిన ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు ఇచ్చిన అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు  ( Allahabad High Court )స్వీకరించింది.

Meerut Blue Drum Murder | హైకోర్టులో విచారణ..

మీరట్ కోర్టు తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదమ్ నారాయణ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టింది. దోషుల తరపున దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

Meerut Blue Drum Murder | నేపథ్యం ఇదే..

భర్త సౌరవ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన నిందితులు, ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికి ఒక నీలి రంగు డ్రమ్‌లో ఉంచారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా దానిపై సిమెంట్‌తో కప్పివేశారు. ఈ కిరాతక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు నిందితులకు మరణశిక్ష ఖరారు చేయగా, తాజాగా వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Nizamabad BJP Protest | ఢిల్లీకి మూటలు మోసే ముఠామేస్త్రీ రేవంత్ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *