Jio Platforms IPO | చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్.. రెండో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించింది. లిస్టింగ్‌తోనే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం, డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది. భారీ ఐపీవో అయినా అంచనాలకు అనుగుణంగానే లాభాలను అందించింది. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టింది.

Jio Platforms IPO | పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన..

జియో ప్లాట్‌ఫామ్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. అతిపెద్ద ఐపీవో (IPO) అయినా సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మొత్తం ఇష్యూ 21.36 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ వాటా 67.15 రెట్లు, ఎన్ ఐఐ కోటా 14 రెట్లు, రిటైల్ కోటా 2.76 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Jio Platforms IPO | 21 శాతం ప్రీమియంతో ఎంట్రీ..

జియో షేర్లు బుధవారం(అక్టోబర్ 28) స్టాక్ మార్కెట్ లో లిస్టయ్యాయి. ఈ షేరు ఇష్యూ ధర రూ.1,119 కాగా.. బీఎసఈ, ఎనఎసఈలో రూ.1358 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 21.36శాతం లాభాలు వచ్చాయి.

Jio Platforms IPO | దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా..

లిస్టింగ్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఐపీవో అప్పర్ ప్రైస్ బ్యాండ్‌పై 21.36శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.12.50 లక్షల కోట్లు చేరింది. తద్వారా దేశంలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన రెండో సంస్థగా ఆవిర్భవించింది. రూ.16.24 లక్షల కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి..: Oct 28 Gold Prices | అంతర్జాతీయంగా బంగారం తగ్గుముఖం.. దేశీయంగా పసిడికి మళ్లీ ఊపు.. హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *