Cyclone Arnab School Holidays | ఏపీని వణికిస్తున్న ‘అర్నబ్’తుఫాన్.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు బంద్..

'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cyclone Arnab School Holidays | ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్  ( Andhra Pradesh )రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాన్ ధాటికి రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. వర్ష తీవ్రత దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Cyclone Arnab School Holidays | భారీ వర్ష హెచ్చరికలు..

విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంలలో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. వాతావరణ పరిస్థితులను, భారీ వర్ష ప్రభావాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Cyclone Arnab School Holidays | ఈదురుగాలుల విరుచుకుపాటు..

తుఫాన్ ప్రభావంతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా వైర్ల సమీపంలో గానీ నిలబడకూడదని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, స్థానిక అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Cyclone Arnab School Holidays | సెలవు ప్రకటించిన 11 జిల్లాలు..

వర్షాల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా అధికారులు పాఠశాలలకు సెలవు ఇచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, పోలవరం ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, మిగతా జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Konda Surekha Apology | కేటీఆర్​కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *