Sensex Nifty Market Closing | లాభాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 308 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు పెరిగాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Sensex Nifty Market Closing | ఐటీ, ఫార్మా రంగాల షేర్ల మద్దతుతో ప్రధాన సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ పరుగులు తీశాయి. అయితే మార్కెట్‌లో లాభపడిన షేర్ల కంటే నష్టపోయిన షేర్లే ఎక్కువగా ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ రక్తమోడాయి. దీంతో ఈవారం చాలామంది ఇన్వెస్టర్ల పోర్ట్‌పోలియోలు భారీగా పడిపోయాయి.

Sensex Nifty Market Closing | ఒడిదుడుకులకు లోనయినా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం ఒడిదుడుకులకు లోనయినా.. కోలుకుని లాభాల బాటలో పయనించింది. ఉదయం సెన్సెక్స్ 48 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా.. వెంటనే లాభాల స్వీకరణతో 117 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 660 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో ప్రారంభమై 59 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 21 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంతో 74,459 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 23,053 వద్ద స్థిరపడ్డాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో, 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 5.20 శాతం, ఇండిగో 4.06 శాతం, ఇన్ఫోసిస్ 3.37 శాతం, ఎన్టీపీసీ 2.23 శాతం, పవర్‌గ్రిడ్ 1.57 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎస్బీఐ 1.94 శాతం, ఎం అండ్ ఎం 1.93 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.47 శాతం, టాటా స్టీల్ 1.06 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.93 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | లాభాల్లో మార్కెట్లు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *