Drunk Driving Case | డ్రంకన్​ డ్రైవ్​లో ఇద్దరికి ఏడురోజుల జైలు..

డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving Case | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు ట్రాఫిక్​ పోలీసులు వివరాలు వెల్లడించారు.

Drunk Driving Case | నిజామాబాద్​ టౌన్​–1 పరిధిలో..

Drunk Driving Case

నిజామాబాద్ (Nizamabad) టౌన్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు దమ్ము నవీన్, నసీరుద్దీన్ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిద్దరిని కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. ఇద్దరికీ ఒక్కొక్కరికి ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా టౌన్-1 పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement | కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు.. అన్నదాతకు లాభాలు..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *