Gujarat Father Kills Son | మూఢనమ్మకం తెచ్చిన ముప్పు.. పదేళ్ల కొడుకును బలి తీసుకున్న తండ్రి

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంత పురోగమిస్తున్నా, గ్రామీణ భారతంలో మూఢనమ్మకాల ఊబి నుంచి ప్రజలు బయటపడలేకపోతున్నారనడానికి గుజరాత్‌లో జరిగిన ఈ అమానుష ఘటన నిదర్శనం.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gujarat Father Kills Son | శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంత పురోగమిస్తున్నా, గ్రామీణ భారతంలో మూఢనమ్మకాల ఊబి నుంచి ప్రజలు బయటపడలేకపోతున్నారనడానికి గుజరాత్‌లో జరిగిన ఈ అమానుష ఘటన నిదర్శనం. తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నాడనే నెపంతో ఒక తండ్రి తన పదేళ్ల కన్న కొడుకును ఆలయంలోనే దారుణంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Gujarat Father Kills Son | తాంత్రిక విద్యలు వద్దనుకున్న తండ్రి..

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ( Ahmedabad )జిల్లా వించియా గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి తాంత్రికుడిగా (స్థానికంగా ‘భువ’ అని పిలుస్తారు) పనిచేస్తున్నాడు. గ్రామస్తుల నమ్మకం ప్రకారం భువలు దేవతలతో మాట్లాడగలరు, ఆవాహన చేయగలరు. నరేష్ తండ్రి కూడా భువనే. అయితే తన తరంతోనే ఈ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు ముగిసిపోవాలని, తన పదేళ్ల కొడుకు ఈ విద్యలు నేర్చుకోకూడదని నరేష్ భావించాడు. కానీ గత కొన్ని నెలలుగా బాలుడి ప్రవర్తన మారడంతో, కొడుకు కూడా తాంత్రికుడిలా మారుతున్నాడని నరేష్ అనుమానించాడు.

Gujarat Father Kills Son | దారుణ హత్య..

కుటుంబ సంప్రదాయాన్ని కొడుకు కొనసాగించడం ఇష్టం లేక నరేష్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకును గ్రామంలోని జోగ్ని మాత ఆలయానికి తీసుకెళ్లి, అమ్మవారి పీఠానికి మూడు సార్లు గట్టిగా గుద్ది, కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు.

Gujarat Father Kills Son | శవం పక్కనే నిద్రపోతూ ..

హత్య అనంతరం కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన నరేష్, ఆరుబయట ఒక మంచంపై శవాన్ని పడుకోబెట్టాడు. పక్కనే ఉన్న మరో మంచంపై ఏమీ ఎరుగనట్లు తాను నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కొడుకు శవం పక్కన తండ్రి నిద్రపోతున్న దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Mahanadi Coalfields IPO | ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో కోల్ ఇండియా నుంచి మరో ఐపీవో!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *