Green SM cabs | హైదరాబాద్‌లోకి వియత్నాం ఎలక్ట్రిక్ క్యాబ్స్ ‘గ్రీన్ ఎస్ఎం’.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే! ఓలా, ఉబెర్ డ్రైవర్లలో ఆందోళన

ఢిల్లీ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సంస్థ రోజుకు 12 గంటలు పనిచేసే డ్రైవర్లకు నెలకు రూ.35,000 స్థిర జీతం ఆఫర్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి:

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Green SM cabs | భాగ్యనగర రవాణా రంగంలో త్వరలో ఒక పెద్ద సంచలనం నమోదుకాబోతోంది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ‘గ్రీన్ ఎస్ఎం’ (Green SM) తన ఈవీ క్యాబ్ సేవలను హైదరాబాద్ నగరానికి విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కిలోమీటర్‌కు కేవలం రూ.9 ధరతో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, హైదరాబాద్‌లోనూ అదే తరహా ప్లాన్‌తో అడుగుపెట్టనుండటంతో సిటీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ లభించనుంది.

Green SM cabs | రూ.3 బిలియన్ డాలర్ల మెగా ఒప్పందం

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 2025 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం – వియత్నాంకు చెందిన ‘విన్రూప్’ (VinGroup – గ్రీన్ ఎస్ఎం మాతృ సంస్థ) మధ్య సుమారు 3 బిలియన్ డాలర్ల అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్యాబ్ సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలో 1,000 కార్లతో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు, భవిష్యత్తులో 10,000 కార్లకు విస్తరించనున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై కూడా ఈ క్యాబ్‌లు కనిపించడంతో సేవలు త్వరలోనే ప్రారంభమవుతాయనే ప్రచారం జరుగుతోంది.

Green SM cabs | సవాళ్లూ ఉన్నాయ్!

పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యానికి ఈవీ క్యాబ్‌లు చెక్ పెట్టనున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ (హైటెక్ సిటీ, గచ్చిబౌలి), శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గాల్లో వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. అయితే, నగరంలో పెద్ద సంఖ్యలో కార్లు పెరిగితే వాటికి తగ్గట్టు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ అవసరాలు ప్రభుత్వం ముందు ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి.

Green SM cabs | ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లలో ఆందోళన!

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్ వంటి సంస్థలు కిలోమీటర్‌కు రూ.15 నుంచి రూ.20 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రీన్ ఎస్ఎం కేవలం రూ.9 కే క్యాబ్ సేవలు అందిస్తే ప్రయాణికులందరూ వీటివైపే మొగ్గు చూపుతారని, దానివల్ల తమ ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని స్థానిక క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 1.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన డ్రైవర్లు మరో 15,000 మంది వరకు ఉంటారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Green SM cabs | ఫిక్స్డ్ జీతం.. కానీ కఠిన నిబంధనలు!

గ్రీన్ ఎస్ఎం నగరంలో కొత్తగా 1,000 నుంచి 2,000 మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించే అవకాశముంది. ఢిల్లీ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సంస్థ రోజుకు 12 గంటలు పనిచేసే డ్రైవర్లకు నెలకు రూ.35,000 స్థిర జీతం ఆఫర్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి:

  • 90% పైగా రైడ్‌లను తప్పనిసరిగా స్వీకరించి పూర్తి చేయాలి.
  • రైడ్‌ను డ్రైవర్లు మధ్యలో క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు.
  • కస్టమర్ల నుంచి 4.8 రేటింగ్ సాధించాలి.
  • ఉబెర్, ఓలా మాదిరిగా నచ్చినప్పుడు లాగిన్/లాగౌట్ అయ్యే ఆప్షన్ ఉండదు.. కార్పొరేట్ ఉద్యోగంలా షిఫ్ట్ పద్ధతిలో పనిచేయాలి.

ఈ కఠిన నిబంధనలు, ఛార్జింగ్ స్టేషన్ల కొరత వల్ల ఢిల్లీలో కొందరు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఎన్ని కార్లకు అనుమతి ఇస్తారు ? ఛార్జింగ్ సదుపాయాలు ఎలా ఉంటాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *