Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను విజయవంతం చేయాలి

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మే5న తలపెట్టిన ఒకరోజు దీక్షను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ (TGEJAC) జిల్లా ఛైర్మన్​ నాశెట్టి సుమన్​కుమార్​ కోరారు. నగరంలోని టీఎన్జీవోస్​ కార్యాలయంలో(TNGOs Office) నిరాహార దీక్ష(hunger strike) సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.

Employee JAC Protest | పీఆర్సీ అమలు చేయాలి

నాశెట్టి సుమన్​కుమార్ మాట్లాడుతూ.. డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని పేర్కొన్నారు. జూన్ రెండు లోపు పీఆర్సీని(PRC demand) అమలు చేయాలన్నారు. పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించాలని.. హెల్త్ కార్డులను వెంటనే జారీ చేయాలని డిమాండ్​ చేశారు. సీపీఎస్​ విధానాన్ని రద్దు చేసి ఏపీఎస్​ విధానాన్ని తీసుకుని రావాలన్నారు. 2004 ఏప్రిల్​ 1వ తేదీ ముందు నోటిఫికేషన్ వెలువడి ప్రస్తుతం సీపీఎస్​లో(CPS issue) ఉన్న ఉద్యోగులను(government employees) వెంటనే (OPS) లోనికి తీసుకొని రావాలన్నారు.

Employee JAC Protest | 64 డిమాండ్ల సాధన కోసం..

వీటితో పాటు మిగతా 64 డిమాండ్ల సాధనకు మే 5వ తేదీన చేపట్టబోయే ఒకరోజు నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఉద్యోగులను(Employee JAC) కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పీ మోహన్ రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, నేతికుంట శేఖర్, జాకీర్ హుస్సేన్, వనమాల సుధాకర్, శ్రీకాంత్, జమీలుల్లా, రమణాచారి, ఓమాజీ, పోల శ్రీనివాస్, తాటి రాజీవ్, గంగాకిషన్, వీరేందర్ సింగ్, అన్వర్ అలీ, వినోద్, జాఫర్ హుస్సేన్, స్వామి, జ్ఞానేశ్వర్, కార్తీక్, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్, ధరమ్ సింగ్, శ్రీరాములు, పురుషోత్తం, రవీందర్, సూర్య ప్రకాష్, ఆంజనేయులు, అశ్విన్ కుమార్, సిర్ప రాజు, మహేందర్, అనురాధ, వినీత, గంగరాజు, మంగమ్మ, వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

18

ఇది కూడా చదవండి:Bathukamma Kunta | బ‌తుక‌మ్మ‌ కుంట ముమ్మాటికీ చెరువే : హైడ్రా క‌మిష‌న‌ర్‌

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *