అక్షరటుడే, వెబ్డెస్క్: Sonia Gandhi | ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జరిగిన అరాచకాలకు సంజయ్ గాంధీని పూర్తిగా నిందించలేమన్నారు.
ఇందిరా గాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977 మార్చి 21 వరకు దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగింది. ఆ సమయంలో ప్రజలు హక్కులు కాలరాశారు. పత్రికలు, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కారు. ప్రశ్నించిన నాయకులు, ప్రజలను జైళ్లలో నిర్బంధించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ సమయంలో అరాచకాలకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ.. ఆ సమయంలో అరాచకాలకు సంజయ్ గాంధీ ఒక్కరే బాధ్యులు కారన్నారు. ఇందిరాగాంధీపై ఆమె సహచర మంత్రుల నుంచి ఒత్తిడి ఉండేదని చెప్పారు. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ నవంబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చేశారు.
Sonia Gandhi | పరిస్థితి చక్కదిద్దారు
చివరకు తన అత్తగారైన ఇందిరా గాంధీ తన సొంత వివేకంతో పరిస్థితిని అర్థం చేసుకొని చక్క దిద్దారని సోనియా గాంధీ అన్నారు. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయి అని ఆమె అంగీకరించారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అరాచకాలకు బహిరంగంగా విచారం వ్యక్తం చేశారన్నారు. ఇందిరా గాంధీ కోణంలో చూసినప్పుడు ఆ సమయంలో ఆమె పడిన కష్టాలు తనకు కనిపించాయన్నారు. హింసాత్మక నిరసనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణాకు నిప్పు పెట్టడం వంటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Abhishek Banerjee | బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.. అభిషేక్ బెనర్జీ ఆరోపణలు