అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PM SHRI Funds Utilization | పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. కలెక్టరేట్లో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, ఎంఈవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.
PM SHRI Funds Utilization | పాఠశాలల వారీగా పనుల పురోగతి..
పాఠశాలల వారీగా పనుల పురోగతి గురించి కలెక్టర్ తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సోక్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తదితర పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పలు పాఠశాలల్లో చక్కగా పనులు జరిగాయని, మిగతా బడులలో కూడా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వెచ్చిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు.
వచ్చే వారం నాటికి అన్ని బడులలో 50శాతంకు పైగా నిధుల వెచ్చింపు పూర్తి కావాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే సంబంధిత బిల్లులను ట్రెజరీలో సమర్పించాలని సూచించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని, పనులను వేరే వారికి కేటాయిస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు విధానం(ఎఫ్ఆర్ఎస్) ద్వారానే హాజరు ప్రక్రియ అమలు జరగాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్ఛార్జి డీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Khanapur Fire Accident | ఖానాపూర్ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ