Khanapur Fire Accident | ఖానాపూర్​ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

నగర శివారులోని ఖానాపూర్​లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Khanapur Fire Accident | నగర (Nizamabad) శివారులోని ఖానాపూర్​లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు.

Khanapur Fire Accident | ట్రాన్స్​ఫార్మర్​ వద్ద గడ్డికి నిప్పు..

అగ్నిమాపక శాఖ అధికారి శంకర్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​ శివారులోని భీమేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్​ వెనక భాగంలో ట్రాన్స్​ఫార్మర్​ వద్ద గడ్డికి నిప్పంటుకుంది. దీంతో సమాచారం అందుకున్న శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సరైన సమయంలో ఫైర్​స్టేషన్​ సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.  ఎస్​ఎఫ్​వో శంకర్​, లీడింగ్​ ఫైర్​ఫైటర్​ ఏసురత్నం, ఫైర్​ఫైటర్లు శీను, హరి, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jail Superintendent | నిజామాబాద్​ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా కళాసాగర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *