అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs New Zealand | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ శనివారం హెన్రీ స్టేడియంలో రెండో వన్డే ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా టీమ్ (India Team) బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. దీంతో పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో ఓపెనర్ టిమ్ సిఫెర్ట్ను నబి ఔట్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
India vs New Zealand | మిచెల్ ఒంటరి పోరాటం
ఓ వైపు వికెట్లు పడుతున్న కివీస్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ ఒంటరి పోరాటం చేశాడు. 104 బంతులు ఎదుర్కొని 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ సాంథర్ 31 పరుగులతో రాణించాడు. దీంతో కివీస్ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4, ఔకిబ్ నబీ 2, అక్షర్ పటేల్ 2, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీశారు.
ఇది కూడా చదవండి..: Vaibhav Suryavanshi Captain | క్రీడా చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 ఏళ్ల వయసులోనే బీహార్ టీ20 కెప్టెన్‌గా అవకాశం.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి జట్టు ప్రకటన!