అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Allegations | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దోపిడీ దొంగల పాలన నడుస్తోందని విమర్శించారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లపై ఆయన ఆరోపణలు చేశారు.
కోడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పారుదల కోసం రేవంత్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఆ పనులకు మంత్రి పొంగులేటి (Minister Ponguleti) సొంత కంపెనీ దరఖాస్తు చేసిందని, మిగిలినవన్నీ బూటకపు, కేవలం కాగితాల మీద ఉన్న కంపెనీలు దరఖాస్తు చేశాయన్నారు. దీంతో ఆ పనులు పొంగులేటి కంపెనీకి దక్కాయని ఆరోపించారు. దీనిని ఒక్కరే పందెంలో గెలిచినట్లు అంటారని ఎద్దేవా చేశారు.
KTR Allegations | అంచనా వ్యయం పెంపు
ప్రాజెక్ట్ ఖర్చులను ప్రభుత్వం భారీగా పెంచిందని కేటీఆర్ ఆరోపించారు. అసలు బడ్జెట్‌కు దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు. రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. కానీ ఇప్పటి వరకు ఒక చుక్క నీటిని ఎత్తిపోయలేదన్నారు. రాష్ట్ర ప్రజలు నీటి కోసం ట్యాంకర్ల క్యూలలో నిలబడుతుండగా, కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Prof R Limbadri IPE Director | IPE నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి బాధ్యతల స్వీకరణ