అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madras Regiment | సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి 12 ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ అయిన విషయం గత నెల 30న వెలుగు చూసిన విషయం తెలిసిందే. నిందితులు మూడు నెలలుగా పక్కా ప్లాన్‌తో ఆయుధాలను మాయం చేశారు. ఇందులో ఏకే –47 సహా పలు ఆయుధాలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసిన ఆర్మీ అధికారి ఈ చోరీలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Madras Regiment | ఆయుధాలు స్వాధీనం
చోరీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి రిటైర్డ్ అధికారి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయుధాలు, మ్యాగజైన్లు, తూటాలు, బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయుధాగారం పనితీరుపై అవగాహన ఉన్న సిబ్బంది సహాయంతో ఆ రిటైర్డ్ అధికారిఈ దొంగతనానికి ప్రణాళిక రచించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి..: Telangana Assembly Day 5 | ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు