అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలో పారిశ్రామిక యూనిట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాష్‌బెస్ట్ కాలనీలో ఉన్న పేపర్ టీకప్పులు, ప్లేట్ల తయారీ యూనిట్‌లో మొదట మంటలు అంటుకున్నాయి. అనంతరం అవి జీఆర్‌టీ గీ, హల్దీరామ్ గిడ్డంగులకు వ్యాపించి, చుట్టుపక్కల ఉన్న అనేక పారిశ్రామిక యూనిట్లకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కనీసం మూడు కంపెనీలు పూర్తిగా కాలిపోయాయి. ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Hyderabad Fire Accident | కాటేదాన్‌లో..
కాటేదాన్‌లో ఓ పరిశ్రమలో ఆదివారంం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Gachibowli Family Suicide | గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య