Airtel Recharge Offer | ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే మరో నెల ఉచితం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Airtel Recharge Offer | ఇటీవల టెలికాం కంపెనీలు రీఛార్జ్ చార్జీలను భారీగా పెంచడంతో సామాన్య మొబైల్ వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది. 5జీ నెట్‌వర్క్ విస్తరణ , నిర్వహణ ఖర్చులు పెరిగాయనే నెపంతో ఈ ఏడాదిలోనే కంపెనీలు రెండుసార్లు రీఛార్జ్ ధరలను పెంచేశాయి. ఈ క్రమంలో వినియోగదారుల ఖర్చును తగ్గించేందుకు ఎయిర్‌టెల్ (Airtel) ఒక అదిరిపోయే ‘వన్ ప్లస్ వన్’ (1+1) ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఒక నెల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. మరో నెల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

Airtel Recharge Offer | ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోనే ..

ఈ ప్రత్యేకమైన ఆఫర్ అందరికీ కాకుండా కేవలం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ (Airtel Thanks App) ద్వారా రీఛార్జ్ చేసుకునే సబ్‌స్క్రైబర్లకు మాత్రమే లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను ఎంచుకుంటే, మరో 28 రోజుల పాటు ఉచిత వ్యాలిడిటీ లభిస్తుంది. దీనివల్ల వినియోగదారులు దాదాపు సగం రీఛార్జ్ డబ్బులను ఆదా చేసుకోవచ్చు.

Airtel Recharge Offer | ఏ ఏ ప్లాన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది?

ఎయిర్‌టెల్ తన ప్రముఖ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ‘1+1’ ఆఫర్‌ను అమల్లోకి తెచ్చింది.

రూ. 349 ప్లాన్: సాధారణంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో ప్రతిరోజూ 2GB డేటాతో పాటు 100 SMSలు లభిస్తాయి. 5జీ సబ్‌స్క్రైబర్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మరో 28 రోజులు ఉచితంగా పొంది, మొత్తం 56 రోజుల పాటు సేవలను వినియోగించుకోవచ్చు. దీనికి అదనంగా రూ. 4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ 12 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులే. ఇందులో రోజువారీ పరిమితి (No Daily Limit) లేకుండా అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లకు కూడా మరో 28 రోజుల ఉచిత వ్యాలిడిటీ ఆఫర్ వర్తిస్తుంది.

Airtel Recharge Offer | చెక్ చేయడం మరవద్దు..

ఈ ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్ అనేది పరిమిత కాలానికి (Limited Period Offer) సంబంధించింది. అంతేకాకుండా ఇది అందరు వినియోగదారులకు కాకుండా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్‌టెల్ యూజర్లు థ్యాంక్స్ యాప్‌లో రీఛార్జ్ చేసుకునే ముందు తమ నంబర్‌కు ఈ ఆఫర్ ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి:  Amrad Fire Accident | అమ్రాద్​లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *