Stock Market Closing | లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయినా.. చివరికి లాభాలతో ముగిసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing  | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఉదయం ఆశావహ దృక్పథంతో మార్కెట్లు ప్రారంభమైనా.. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల బాట పట్టాయి. ఐటీ,టెలికాం రంగాలలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రధాన సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో తిరిగి పుంజుకున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్, ఫార్మా రంగాల షేర్లు రాణించాయి.

Stock Market Closing  | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 328 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 12 పాయింట్లు పెరిగింది. లాభాల స్వీకరణతో అక్కడినుంచి 820 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 238 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మద్దతుగా నిలిచారు. దీంతో మార్కెట్లు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 81,106 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 25,044 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Closing | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,010 కంపెనీలు లాభపడగా 2,422 స్టాక్స్ నష్టపోయాయి. 247 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 146 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 60 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో, 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్బీఐ 2.43 శాతం, ట్రెంట్ 2.13 శాతం, ఎల్టీ 1.96 శాతం, ఎన్టీపీసీ 1.59 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.22 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్సీఎల్ టెక్ 2.49 శాతం, టాటా స్టీల్ 2.43 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.83 శాతం, టెక్ మహీంద్రా 1.75 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రధాన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *