అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Today | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం ఆశావహ దృక్పథంతో ప్రారంభమైనా.. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి ప్రధాన సూచీలు భారీగా పతనమయ్యాయి. ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ట్రెండ్స్ ప్రభావంతో బ్లూచిప్ ఐటీ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి.
Stock Market Today | లాభాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 328 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 12 పాయింట్లు పెరిగింది. లాభాల స్వీకరణతో అక్కడినుంచి 820 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 238 పాయింట్లు కోల్పోయింది. అయితే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లతో మద్దతుగా నిలిచారు. దీంతో మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంతో 80,976 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 24,981 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎస్బీఐ 3.05 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.72 శాతం, ట్రెంట్ 1.38 శాతం, ఎల్టీ 1.07 శాతం, ఎన్టీపీసీ 0.97 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 2.35 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.15 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.77 శాతం, ఇన్ఫోసిస్ 1.70 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.40 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Coca-Cola IPO | ఐపీవోకు కోకా కోలా.. సెబీకి డీఆర్‌హెచ్పీ సమర్పణ