అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి సోమవారం ఉదయం ఆయన కరీంనగర్ (Karimnagar)లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం సమష్టిగా పని చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతామన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామన్నారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మేరకు నవోదయ, కేంద్రీ య విద్యాలయాల కోసం ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి, వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Ponnam Prabhakar | ఆలయాల అభివృద్ధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను అభివృద్ధి చేస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలగందుల ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. కరీంనగర్ నగరంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి, పేదలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana New Pensions | తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు