అక్షరటుడే వెబ్‌డెస్క్: Ujjivan WhatsApp Banking | భారతీయ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Ujjivan SFB) ఒక విప్లవాత్మక డిజిటల్ సేవకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా కస్టమర్లు ఎలాంటి ప్రత్యేక బ్యాంకింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకుండానే నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు తమ రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించే వాట్సాప్ వేదికగానే ఈ సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తోంది.
Ujjivan WhatsApp Banking | సులభమైన విధానం..
క్రొత్త కస్టమర్లు చాలా వేగంగా, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ క్రింది విధంగా తమ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.
మెసేజ్ పంపడం: కస్టమర్లు తమ మొబైల్లో 900 208 2121 నంబర్‌ను సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
ఆప్షన్ ఎంపిక: ఆ తర్వాత అందులో వచ్చే ఆప్షన్లలో ‘Open Savings Account’ను ఎంచుకోవాలి.
వివరాల ధృవీకరణ: మొబైల్ నంబర్ , పాన్ (PAN) కార్డ్ వివరాల వెరిఫికేషన్ పూర్తయ్యాక.. CKYC లేదా ఆధార్ ద్వారా వ్యక్తిగత వివరాలు ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి.
డిపాజిట్ & వీడియో కేవైసీ: కస్టమర్ తనకు నచ్చిన సేవింగ్స్ అకౌంట్ రకాన్ని ఎంచుకుని, ప్రారంభ డిపాజిట్ సొమ్మును చెల్లించి, వీడియో కేవైసీ (Video KYC) పూర్తి చేయాలి.
వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అకౌంట్‌ను నేరుగా వాడుకోవడం ప్రారంభించవచ్చు.
Ujjivan WhatsApp Banking | వాట్సాప్‌లోనే 50కి పైగా బ్యాంకింగ్ సేవలు..
ప్రస్తుతం ఉజ్జీవన్ బ్యాంక్‌కు సంబంధించిన 15 లక్షలకు పైగా వినియోగదారులు ఇప్పటికే వాట్సాప్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్యాంక్ వచ్చే మొత్తం సర్వీస్ రిక్వెస్ట్‌లలో 22 శాతం కేవలం వాట్సాప్ ద్వారానే పరిష్కారమవుతున్నాయి. అకౌంట్ ఓపెనింగ్‌తో పాటు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా ఖాతా నిల్వ తనిఖీ (Balance Enquiry), అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్ సేవలు, లోన్ వివరాలు, బ్యాంక్ బ్రాంచ్ & ఎటీఎం లొకేషన్లతో సహా 50కి పైగా రకాల సేవలను పొందే అవకాశం ఉంది.
Ujjivan WhatsApp Banking | సౌలభ్యమే మా ముఖ్య ఉద్దేశం..
“బ్యాంకింగ్‌ను వినియోగదారులకు మరింత సరళంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన అర్థం ఉంటుంది. ప్రజలు ప్రతిరోజూ వాడే వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌పైనే పూర్తి బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా అందించడమే మా ముఖ్య ఉద్దేశం” అని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇంటెరిమ్ సీఈఓ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కారొల్ ఫుర్టాడో వెల్లడించారు.
భిన్న భాషల్లో సేవలు..
కస్టమర్లకు డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Gen-AI), వాయిస్ అసిస్టెన్స్ (మాటల ద్వారా సహాయం), ప్రాంతీయ భాషల్లో సేవలను కూడా వాట్సాప్ బ్యాంకింగ్‌లో అనుసంధానించనున్నట్లు బ్యాంక్ యాజమాన్యం వెలడించింది.
ఇది కూడా చదవండి: Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై