అక్షరటుడే, వెబ్డెస్క్: Pawan Kalyan Divorce | నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకున్నారు. పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోతున్నట్టుగా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
పవన్, అన్నా కొనిదెల 13 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో, తాము “పరస్పర అవగాహన మరియు గౌరవంతో” ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామన్నారు. పిల్లల సంతోషం, శ్రేయస్సు ఎల్లప్పుడూ మా ఇద్దరికీ ప్రాధాన్యతగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని వారు కోరారు.
Pawan Kalyan Divorce | మూడోసారి
పవన్ కల్యాణ్ 1997లో నందినిని వివాహం చేసుకున్నారు. 1999లో వారు విడిపోయారు. ఆ తర్వాత 2009లో నటి రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 2012లో వీరి వివాహ బంధం విడాకులతో ముగిసింది. 2013లో పవన్, రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. వీరికి పోలెనా అంజన పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Pawan Kalyan Divorce | నెట్టింట చర్చ
పవన్ కల్యాణ్ విడాకులపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పలువురు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. పవన్ విడాకులు తీసుకోవడం, ఆయన వ్యక్తిగత నిర్ణయని అంటున్నారు. కాగా పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని గతంలో వేణుస్వామి చెప్పిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. అయితే 55 ఏళ్ల పవన్ మరో పెళ్లి చేసుకుంటారా.. లేదా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి..: AP Local Elections | ఏపీ స్థానిక ఎన్నికలు.. కౌంటింగ్ ప్రారంభం