SIM Binding Rules | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఫోన్‌లో సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్

దేశంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు , ఫిషింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: SIM Binding Rules | దేశంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు , ఫిషింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు ఉపయోగించాలంటే ఆ ఖాతాకు లింక్ అయిన యాక్టివ్ సిమ్ కార్డ్ (SIM Card) తప్పనిసరిగా అదే ఫోన్‌లో ఉండాలనే ‘సిమ్ బైండింగ్’ నిబంధనను తీసుకువస్తోంది. ఇప్పటివరకు సిమ్ లేకపోయినా కేవలం వైఫై (Wi-Fi) ఆధారంగా వాట్సాప్ వాడే వెసులుబాటు ఉండగా.. త్వరలో ఆ సౌకర్యానికి తెరపడనుంది. 2024 ఒక్క ఏడాదినే సైబర్ నేరగాళ్లు రూ.22,800 కోట్లకు పైగా కొల్లగొట్టిన నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలను రూపొందించారు.

SIM Binding Rules | కొత్త రూల్స్ వర్తింపు..

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం కేవలం వాట్సాప్‌ మాత్రమే కాకుండా భారతీయ మొబైల్ నంబర్లతో నడిచే మరికొన్ని ప్రముఖ యాప్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal), స్నాప్‌చాట్ (Snapchat), అరట్టై (Arattai), షేర్‌చాట్ (ShareChat), జోష్ (Josh), , జియోచాట్ (JioChat) యాప్‌లలో ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.

SIM Binding Rules | సిమ్ లేకపోతే సేవలు బంద్..

కొత్త మార్గదర్శకాల ప్రకారం మీరు ఉపయోగిస్తున్న వాట్సాప్ నంబర్‌కు సంబంధించిన సిమ్‌ను ఫోన్ నుంచి తొలగిస్తే, ఆ పరికరంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఫోన్‌లో వైఫై లేదా వేరే సిమ్ ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నప్పటికీ, వాట్సాప్ రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ అందులోనే ఉండటం తప్పనిసరి. డ్యూయల్ సిమ్ వాడేవారికి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఖాతా నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. విదేశాలకు వెళ్లేవారు భారతీయ సిమ్‌ను ఫోన్‌లోనే ఉంచి రోమింగ్ సేవలు పొందితే వాట్సాప్ యథావిధిగా పనిచేస్తుంది. స్థానిక విదేశీ సిమ్ కోసం భారతీయ సిమ్‌ను తీసేస్తే సేవలకు అంతరాయం కలగవచ్చు.

SIM Binding Rules |ప్రభుత్వం స్పష్టత..

వాట్సాప్ వెబ్‌ వినియోగదారులకు సంబంధించి ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యే నిబంధనపై ప్రభుత్వం కీలక సవరణ చేసింది. సెషన్ లాగౌట్ అనేది కాలపరిమితి ఆధారంగా కాకుండా రిస్క్ నిర్వహణ (Risk-based) ఆధారంగా మాత్రమే జరుగుతుందని ఏప్రిల్ 2026లో ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది.

జనవరి 1 నుంచి అమల్లోకి..
ఈ సిమ్ బైండింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం శాఖ యాప్‌లకు డిసెంబర్ 31, 2026 వరకు గడువు విధించింది. జనవరి 1, 2027 నుంచి ఈ కొత్త సిమ్ బైండింగ్ విధానం దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానుంది.

ఇది కూడా చదవండి:  Srinivas Goud Rachakonda | గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *