Kasturba School Inspection | కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Kasturba School Inspection | మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

Kasturba School Inspection | మెనూ పాటించకపోతే కఠినచర్యలు..

ఈ సందర్భంగా కలెక్టర్​ పాఠశాల ఆవరణ, టాయిలెట్లు, తరగతి గదులను పరిశీలించారు. స్టోర్ రూంలో నిలువ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను గమనించారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూలో పేర్కొన్న క్యారెట్ కర్రీకి బదులుగా ఆలూ కర్రీ వండడాన్ని గమనించిన కలెక్టర్, నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో డైట్ మెనూ రూపొందించిందని, దానిని పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రయోజనం ఏమిటని మందలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.

Kasturba School Inspection | పరిశుభ్రత పాటిస్తేనే మంచిది…

పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, నిరుపయోగ వస్తువులు ఉండడాన్ని కలెక్టర్​ గమనించారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. అనంతరం 6వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించి చిన్నారులను ప్రోత్సహించారు. చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట స్థానిక ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంఈవో శ్రీనివాస్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Srinivas Goud Rachakonda | గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *