అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ లాభాలతో సాగిన సూచీలు ప్రాఫిట్ బుకింగ్‌తో ఒక్కసారిగా పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,103 పాయింట్లు, నిఫ్టీ 329 పాయింట్లు పడిపోయాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి.
Stock Market Closing | గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్..
ముడి చమురు ధరలు తగ్గుతుండడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడంతో భారత స్టాక్ మార్కెట్‌లో బుధవారం మధ్యాహ్నం వరకు బుల్ జోరు కొనసాగింది. ఈ క్రమంలో నిఫ్టీ, సెన్సెక్స్ ఎనిమిది నెలల గరిష్టానికి చేరాయి. పది రోజుల్లోనే పది శాతానికిపైగా పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. దీంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి.
Stock Market Closing | భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,142 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 279 పాయింట్ల దిద్దుబాటుకు గురయ్యింది. అక్కడినుంచి పుంజుకుని 551 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 293 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 74 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 161 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,103 పాయింట్లు, నిఫ్టీ 329 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 772 పాయింట్ల లాభంతో 81,879 వద్ద, నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 25,255 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Closing | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,913 కంపెనీలు లాభపడగా 1,592 స్టాక్స్ నష్టపోయాయి. 207 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 144 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 57 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎం అండ్ ఎం 5.25 శాతం, ఇండిగో 4.37 శాతం, ట్రెంట్ 3.02 శాతం, టాటా స్టీల్ 2.22 శాతం, ఐటీసీ 2.15 శాతం లాభపడ్డాయి.
Top Losers : అదానీ పోర్ట్స్ 1.66 శాతం, టెక్ మహీంద్రా 1.29 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.95 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.95 శాతం, టైటాన్ 0.80 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Brillaince Platform | భారత్‌లో కొత్త బ్రాండ్ అండ్ రెపుటేషన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రిలియెన్స్’ లాంచ్