అక్షరటుడే, కమ్మర్పల్లి: Junior Softball Tournament | క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లిలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం శనివారం 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు.
Junior Softball Tournament | రాష్ట్రస్థాయి పోటీలు కమ్మర్‌పల్లిలో..
ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్మర్పల్లి (Kammarpally)లో.. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చే విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇదే క్రీడా మైదానంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే. శోభన్ బాబు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్లో 21 జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు, 100 మంది అఫీషియల్స్ పాల్గొన్నారని చెప్పారు.
Junior Softball Tournament | పంజాబ్‌లో జాతీయస్థాయి పోటీలు
పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 24 నుంచి 28 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పంపిస్తామని శోభన్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. నవీన్ కుమార్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఏ. రవీందర్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, సుజాత, చిప్ప నవీన్, మెండె రమేష్, వేముల నాగభూషణం, నాగిరెడ్డి, శ్యామ్ సుందర్ శర్మ, గంగాధర్, వెంకటేష్, రాజశేఖర్, వాసు, మైలారం సుధాకర్, రిటైర్డ్ ఎంఈవో దేవేందర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Panchayat Funds Scam | పంచాయతీ నిధుల్లో గోల్మాల్.. సర్పంచ్‌లలో గుబులు