అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Building Collapse | దేశ రాజధానిలో మరో భవనం కూలిపోయింది. తూర్పు ఢిల్లీ (Delhi)లోని వివేక్ విహార్‌లో మంగళవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలగా.. ఒక వ్యక్తి, ఒక బాలుడు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.
షాహదారా జిల్లాలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జ్వాలా నగర్ ప్రాంతంలో ఒక పాత భవనం కూలిపోయింది. అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసులు మరియు అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 7-8 మందిని రక్షించారు. కూలిపోయిన కట్టడం కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం సహాయక బృందాలు ఘటనా స్థలంలో గాలిస్తున్నాయి.
Delhi Building Collapse | వరుస ప్రమాదాలు
ఢిల్లీలో ఇటీవల అనేక భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తరచూ పాత భవనాలు కూలిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సెప్టెంబర్‌లో దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో, ఢిల్లీ యూనివర్సిటీ కళాశాల పక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ వసతిగా ఉపయోగిస్తున్న ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులు, మరో ఇద్దరు మృతి చెందారు. చావ్రీ బజార్లో ఈ నెల 5న ఓ భవనం కూలిపోయింది. ఈ క్రమంలో అధికారులు స్పందించి నివాస యోగ్యం కాని భవనాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Uttarakhand Bus Accident | లోయలో పడిన బస్సు.. ఆరుగురి మృతి