అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Golconda Aircraft Crash | గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్లో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
సెస్నా-152 విమానంలో శిక్షణ ఇస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో పైలెట్లు కిందకు దించారు. అయితే అది చెట్టును ఢీకొంది. దీంతో రెండు ముక్కలు అయింది. ప్రమాదంలో ట్రైనీ పైలట్ అనుష్క బజ్పాయ్, ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ ప్రశాంత్ కుమార్ గాయపడ్డారు. వారిని లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టనుంది.
గోల్కొండ కంటోన్మెంట్ ఏరియాలో కూలిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ శిక్షణ విమానం..
చెట్టుపై ల్యాండింగ్..
ట్రైనీ, ట్రైనర్ సురక్షితం.. https://t.co/4AyyhvDQaE
— Prabhakar Venavanka (@Prabhavenavanka) November 26, 2026
దీనిని కూడా చదవండి : Sabarimala Video Ban | అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే అరెస్టే..