Golconda Aircraft Crash | గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో కూలిపోయిన విమానం

గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానం కూలిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Golconda Aircraft Crash | గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

సెస్నా-152 విమానంలో శిక్షణ ఇస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సిన పరిస్థితి రావడంతో పైలెట్లు కిందకు దించారు. అయితే అది చెట్టును ఢీకొంది. దీంతో రెండు ముక్కలు అయింది. ప్రమాదంలో ట్రైనీ పైలట్ అనుష్క బజ్‌పాయ్, ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ ప్రశాంత్ కుమార్ గాయపడ్డారు. వారిని లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టనుంది.

దీనిని కూడా చదవండి : Sabarimala Video Ban | అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే అరెస్టే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *