Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేంద్ర మంత్రివర్గం డీలిమిటేషన్​తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Bill | కేంద్ర మంత్రివర్గం డీలిమిటేషన్​తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మోదీ (Modi) ప్రభుత్వం ఈ బిల్లులో రెండు కీలక సవరణలను చేర్చింది. లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడం, లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించే గడువును మరో 25 ఏళ్ల పాటు పొడిగింంచింది.నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచితే తాము నష్టపోతామని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50సీట్లు ఏకరీతిగా పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Delimitation Bill | పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలను నవంబర్ 30 నుంచి నిర్వహించనున్నారు. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలకు ఇవి కొనసాగింపుగా ఉంటాయి. ఆగస్టు 13న పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది, కానీ అధికారికంగా సమావేశాలు ముగిసినట్లు (ప్రొరోగ్) ప్రకటించలేదు. ఈ ప్రత్యేక సమావేశాలు డిసెంబర్ 3 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్​ బిల్లుతో పాటు ఇతర బిల్లులు సైతం పెట్టనున్నట్లు తెలిసింది.

Delimitation Bill | ఏప్రిల్​లో వీగిపోయిన బిల్లు

లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ బిల్లు, గత ఏప్రిల్‌లో ఆమోదం పొందలేకపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఆమోదం కోసం మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కేంద్రం మద్దతు సాధించకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఈ క్రమంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి ఆ బిల్లును తీసుకొస్తుంది. దీనికి ఏయే పార్టీలు మద్దతు తెలుపుతాయో తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Train Fire Safety | ఏసీ బోగీలో దీపం వెలిగించిన ప్రయాణికుడు.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *