Kamareddy Drinking Water | మార్చి 1 నుంచి ఇంటింటికి తాగునీరు..: ఎమ్మెల్యే కేవీఆర్​

కామారెడ్డి పట్టణంలో మార్చి 1 నుంచి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Drinking Water | పట్టణంలో మార్చి 1 నుంచి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో పర్యటించారు.

Kamareddy Drinking Water | అమృత్​ పథకంలో భాగంగా..

అమృత్ పథకం ద్వారా వివిధ వార్డుల్లో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తొమ్మిది వాటర్ ట్యాంకులు, ఒక వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు నిర్మాణ పనులను, కామారెడ్డి పెద్ద చెరువు సుందరీకరణ, డ్రైనేజీ నీటి మళ్లింపు పనులను అధికారులతో ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఎంబీఆర్ ఫిల్టర్ బెడ్, ఇండోర్ స్టేడియం, ప్రగతి నగర్, జయశంకర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, ఇస్లాంపురా, ఆర్డీవో కార్యాలయం, డబ్ల్యూటీపీ, లిటిల్ స్కాలర్స్, పెద్ద చెరువు, లింగాపూర్ చెరువు, సీనియర్ సిటిజన్ భవనం, ఇందిరా నగర్ వైకుంఠధామం పనుల పురిగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Kamareddy Drinking Water | వేసవికి ముందే వాటర్​ట్యంకుల నిర్మాణం..

ఈ సందర్భంగా కేవీఆర్​ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య రాకుండా వేసవికి ముందే వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తయి నీటి సరఫరా ప్రారంభం కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 తేదీ వరకు ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయి, మార్చి 1 నుండి ఇంటింటికి తాగునీరు అందించడమే మొదటి లక్ష్యమన్నారు. అంతేకాకుండా ఒక్కో చెరువుకు రూ.3.14 కోట్ల చొప్పున కామారెడ్డి పెద్ద చెరువు, లింగాపూర్ చెరువుల సుందరీకరణ, డ్రైనేజీ నీటి మళ్లింపు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులను కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా వచ్చే 15 రోజుల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: డప్పు దరువు.. చిందేసిన శివారెడ్డి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *